Thursday, 5 November 2026

డయల్‌ యువర్‌ కలెక్టర్‌తో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, నవంబర్‌ 12 : జిల్లాలో ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జేసి హెచ్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులను సమావేశపరిచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం, జిల్లా కేంద్రానికి రాలేని వారు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 10.30 వరకు నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఫోన్‌ ద్వారా తమ సమస్యను తెలిపితే అధికారులు సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఫోన్‌  చేయాలనుకున్న వారు తమపేరు,   గ్రామం, సమస్యను  క్లుప్తంగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో  అదనపు జేసి సుందర్‌ అబ్నార్‌, డిఆర్‌డిఏ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌లు శంకరయ్య, మనోహర్‌, జడ్పీ సిఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *