Tuesday, 3 November 2026

డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులను సమావేశపరచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంకు ఫోన్‌ చేయాలనుకున్న వ్యక్తి తన పేరు, గ్రామం, మండలం, పేరు తెలిపి సమస్యను క్లుప్తంగా వివరించాలని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ఫోన్‌ చేసి తమ సమస్య తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఏడుగురు వ్యక్తులు ఫోన్‌ చేసి సమస్యలు తెలుపగా అధికారులు సమస్యలను నోట్‌ చేసుకొని పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ సుధాకర్‌రావు, డిఆర్‌డిఎ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌లు శంకరయ్య, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *