Tuesday, 3 November 2026

పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: ఈ నెల 31వ తేదీన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించి జిల్లా సమీక్షా సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. 31వ తేదీ కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10గంటలకు డి.ఆర్‌.సి సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. డి.ఆర్‌.సి. సమావేశంలో శాఖల వారీగా సమీక్షించనున్న అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సన్నాహక సమావేశంలో అన్ని అంశాలను సమీక్షించి కలెక్టర్‌ అధికారులకు సూచనలు జారీ చేశారు.  ఈ సమావేశంలో తాగునీరు, ఐకెపి, వైద్య, ఆరోగ్యశాఖ, రాజీవ్‌ యువకిరణాలు, పరిశ్రమలశాఖ, ఏపి మైక్రో ఇరిగేషన్‌, వ్యవసాయ, ఉద్యాన శాఖ, మార్కెటింగ్‌, ఉపాధిహామీ శాఖల వారిగా కలెక్టర్‌ సమీక్షించి అధికారులు పూర్తి సమాచారంతో సన్నద్ధంగా, అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *