Tuesday, 3 November 2026

డాక్టరేట్ పట్టాతో మరింత బాధ్యత పెరిగింది.

డాక్టరేట్ పట్టా రావడంతో మరింత బాధ్యత పెరిగిందని ప్రముఖ సంఘ సేవకులు,ఎన్టీఆర్ కార్మికరత్న అవార్డు గ్రహీత బత్తిని నరసింహ గౌడ్ తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలను గుర్తించి,బడుగు బలహీన వర్గాల వారికి ముందుండి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించినందుకు ఆసియా వేదిక్ కల్చరల్ యూనివర్సిటీ బెంగళూరు వారు గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేసి గౌరవించడంతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.అవార్డు రావడానికి సహకరించిన తల్లిదండ్రులకు,కాలనీ వాసులకు,ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.