పూర్వ విద్యార్థుల దాతృత్వం….
వీణవంక నవంబర్ 23 (జనం సాక్షి) వీణవంక మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువు చెప్పిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వానమాముల రంగాచార్యులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి మేమున్నాం అంటూ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు గురువు పై ఉన్న గౌరవంతో తమ వంతు గురు భక్తి ని చాటుకొని మూడు లక్షల రూపాయలు విరాళాలు సేకరించి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. అట్టి డబ్బులను కేడిసీసి వీణవంక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ బాండ్ ను వారి సతీమణి పద్మ కు బ్యాంక్ మేనేజర్ అభిలాష్, సమ్మయ్య మరియు పూర్వ విద్యార్థుల సమక్షంలో బుధవారం అందజేయడం జరిగింది . ఇట్టి బృహత్తర కార్యక్రమానికి సహకరించిన పాఠశాల పూర్వ విద్యార్థులు, పూర్వాహచార్యులు, ప్రబంధకారీని కమిటీ సభ్యుల కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాఠశాల పూర్వ విద్యార్థి పరిషత్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పత్తి కొండల్ రెడ్డి ,సింగం సత్యనారాయణ, అల్లంకి నాగరాజు, సూరోజు రాఘవులు, గోపు రాజేష్ ,నీల రమేష్, పిట్టల సురేష్ , బాలోజు గోపాల కృష్ణ ,పొదిల్ల అశోక్, సముద్రాల అజయ్, తదితరులు పాల్గొన్నారు.




