జుక్కల్, జూలై 1, (జనంసాక్షి),డాక్టర్లు భగవంతుడితో సమానమని జుక్కల్ మండల రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్ డోoగ్లే ఉమాకాంత్ అన్నారు. ఆయన శనివారం డాక్టర్స్ డే ను పురస్కరించుకుని జుక్కల్ మండల రెడ్ క్రాస్ సొసైటి అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విక్రమ్, డాక్టర్ విఠల్ ను పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతు డాక్టర్లు నిరంతరం రోగుల ప్రాణాలను కాపాడడానికి కృషిచేస్తారని తెలిపారు. అర్దరాత్రి,అపరాత్రి అని తేడాలేకుండా ఎప్పుడైనా రోగుల సేవకు సిద్దంగా ఉంటారని తెలిపారు.దురదృష్టవశాత్తు అక్కడక్కడ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని అది ఎంతమాత్రం మంచిదికాదని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కోశాధికారి దస్థిరాం,హెల్త్ సూపర్వైజర్ యోగేష్ ,శైలేష్ పటేల్ ,శివప్ప, అమూల్ యువకులు,ఆశ కార్యకర్తలు,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్లు భగవంతుడితో సమానం




