Monday, 2 November 2026

వార్డులలో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ జూలై 1 జనం సాక్షి
వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం” మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా వికారాబాద్* పట్టణంలోని28వ వార్డు గాంధీ కాలనీ మరియు 32వ వార్డు శివరాం నగర్ కాలనీలలో* ఉదయం పర్యటించారు. కాలనీలలో పాడుబడ్డ ఇళ్లను తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గాంధీ కాలనీలోని పాత పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో పాడుబడ్డ భవనాలను త్వరగా కూల్చివేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు.కాలనీలలోని పాత స్థంబాలు తొలగించాలని, వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరి చేయాలని, కాలనీలలోని తదితర విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ.కాలనీలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు డ్వాక్రా మహిళా సంఘం బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేద్దాం అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌన్సిలర్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.