Thursday, 5 November 2026

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మరియు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి

 

 

 

 

 

రఘునాథ పాలెం ఏప్రిల్ 13(జనం సాక్షి)ఏప్రిల్ 14న హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ మరియు వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం మాల మహానాడు మాదిగ హక్కుల దండోరా టిఆర్ఎస్ ఎస్సీ సెల్ వివిధ ప్రజా సంఘాల సమావేశంలో లింగాల రవికుమార్ మరియు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సారధ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసి అన్ని వర్గాల ప్రజలు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కు నాయకులు అభినందనలు తెలియజేశారు భారత పార్లమెంట్ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళటం జరుగుతుందని తెలియజేశారు బస్సులు మరియు భోజన వసతి ఏర్పాటు చేశారని తెలిపారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి రేపు ఉదయం 7 గంటలకు అంబేద్కర్ సెంటర్ జెడ్ పి వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి హైదరాబాదుకు తరలి వెళ్ళటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంతెటి వీరభద్రం మాదిగ హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తొగర భాస్కర్ దళిత నాయకులు హెచ్ ప్రసాద్ ఆరంపులు వీరభద్రం గంటా భీమయ్య పి జోషి అంబేద్కర్ సంఘం నాయకులు ఎర్ర గంగాధర్ కొప్పుల రామారావు చామలేటి శ్రీనివాసరావు నల్లపు రమేష్ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు