Thursday, 5 November 2026

గ్రామీణ ప్రాంత ప్రజల లో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. రాష్ట్ర మంత్రులు టి హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 13 జనం సాక్షిగ్రామీణ ప్రాంత ప్రజలకు రాయితీతో కూడిననాణ్యమైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి లు పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలో ఈషా సూపర్ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్మాణం చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యం అందుబాటులో వచ్చే విధంగా రాయితీతో కూడిన వైద్య సేవలు అందించాలని వారు సూచించారు వికారాబాద్ పట్టణంలో గతంలో వంద పడకల ఆసుపత్రి లేకుంటే నగరానికి వెళ్లాల్సి వచ్చేదని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో నగరానికి వెళ్లేసరికి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని వారు తెలిపారు ఇలాంటి ఆస్పత్రి నిర్మాణం చేపట్టిన యజమాన్యాన్ని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ బి ఆర్ ఎస్ యువజన నాయకుడు వడ్ల నందు చౌదరి యాదవ రెడ్డి ధరూర్ జెడ్పిటిసి సుజాత వేణుగోపాల్ రెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ హనుమంతు రెడ్డి రత్నారెడ్డి చిగుళ్లపల్లి రమేష్ కుమార్ కిషన్ నాయక్ వెంకట్ రంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల నాయకులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు