వివోఏ ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు డిఆర్డిఓ
ఝరాసంగం నవంబర్ 26 జనం సాక్షి మండల కేంద్రంలో ని ఝరా సంగం లోని ఐకేపీ కార్యాలయంలో శనివారం వివోఏ ల సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు డిఆర్డీఓ సూర్యారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివోఏ ల పనితీరుపై సమీక్షించారు. వారి పని తీరు పట్ల సంతృప్తి చెంది పోటీపల్లి గ్రామానికి చెందిన వివోఏ పాటిల్ ను సన్మానించడం జరిగింది.సమావేశంలో బ్యాంకు లింకేంజి, శ్రీనిధి మరియు కొత్త సంఘాల పనితీరు అకౌంటింగ్ విఓ మిటంగ్ లపై సమీక్ష నిర్వహించారు.కార్యక్రమంలో డిపిఎం మల్లేశం, ఏపీఎం బాల కృష్ణ, స్త్రీ నిది అసిస్టెంట్ మేనేజర్ సమీన సిసి లు వివోఏ లు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వివోఏ ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు డిఆర్డిఓ




