Thursday, 5 November 2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జార్జి రెడ్డిల జీవితం స్ఫూర్తిదాయకం టి పి టి ఎఫ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు.

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 14. (జనంసాక్షి). భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉస్మానియా ఉద్యమ ధ్రువతార జార్జిరెడ్డిల జీవితం స్ఫూర్తి దయకమని టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిడిఎస్ యు (విజృంభన) పూర్వ విద్యార్థి నాయకులు అన్నారు. శుక్రవారం పిడిఎస్ యు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి, ఉస్మానియా ఉద్యమ ధ్రువతార జార్జి రెడ్డి 51 వర్ధంతి పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జార్జి రెడ్డిల జీవితాల నుంచి నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని నేర్చుకోవాల్సింది ఉందని అన్నారు. దేశంలోని అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం వారు చూపించిన మార్గం అనుసరణీయమని తెలిపారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, పిడిఎస్ యు(విజృంభణ) పూర్వ విద్యార్థి నాయకులు, పి ఓ డబ్ల్యు స్త్రీ విముక్తి నాయకులు పాల్గొన్నారు.