Thursday, 5 November 2026

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశయాల కోసం శ్రమీద్దాం: ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్

 

 

 

 

ఖమ్మం తిరుమలాయపాలెం  (ఏప్రిల్ 14) జనం సాక్షి. మండల పరిషత్ లో ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ అధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్* మాట్లాడుతూ అంబేద్కర్  జయంతి సందర్భంగా వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరు బాధ్యతన్నారు.  భారతదేశంలో అత్యంత ఎత్తైన 125 అడుగుల  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  విగ్రహా ఆవిష్కరణలో  ముఖ్యమంత్రి కేసీఆర్  ఆధ్వర్యంలో అవకాశం కలగటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. వారి కీర్తికి గుర్తింపుగా హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి గౌరవిస్తుందన్నారు*. అంబేద్కర్ గారి స్ఫూర్తితో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి, దళితుల సాధికారతకు పాటుపడిందని, దళిత బంధుతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు.అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నరు. దురదృష్టవశాత్తు బిఆర్ అంబేద్కర్  ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందినవాడిగా కొన్ని శక్తులు ప్రచారం చేసే విధంగా పనిచేస్తున్నాయని అన్నారు. వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారి చూపిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కో ఆష్షన్ సభ్యులు సైపూద్దీన్, మండల బి ఆర్ ఎస్ నాయకులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది.తదితరులు పాల్గొన్నారు.