రుద్రూర్, జూన్ 16 (జనంసాక్షి) :రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మీ (లక్షమ్మ) అమ్మ వారి మందిర ప్రహరీ గోడ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ. 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందనిమండల నాయకులు తెలిపారు,
అదేవిధంగా కీ.శే. పత్తి గంగారాం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్ లు టేకు తలుపులు చేయించి శుక్రవారం అమ్మ వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అనంతరం తలుపులు బింగించారు. ఈ కార్యక్రమంలో కీ.శే. పత్తి గంగారాం గారి సతీమణి లక్ష్మీ, వారి కుమారులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్ వారి కూతురు, అల్లుడు దుగ్గమ్ వార్ మనీషా శంకర్,వారి తమ్ముడు పత్తి సాయిలలతో పాటు బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, రుద్రూర్ సొసైటీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, గ్రామ పెద్దలు అక్కపల్లి నాగేందర్, కోడె సుభాష్, బొట్టే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.




