Wednesday, 4 November 2026

డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు ను సన్మానించిన జిల్లా అసోసియేషన్

 

 

 

 

 

స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 19 , (జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జనగామ జిల్లా సహాయ కార్యదర్శిగా చిల్పూర్ మండలంలోని కృష్ణాజి గూడెం గ్రామానికి చెందిన డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రం లో వేముల వెంకటేశ్వర్లు ను తెలంగాణ రాష్ట్ర ఆర్ఎం పి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆర్ఎంపీ అండ్ పిఎంపి అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరంకృషి చేస్తా నన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జనగామ జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షుడు పసు నూరి సత్యనారాయణ కు, మంతెన రమేష్ కు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు, మిత్రులకు ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు.