Tuesday, 3 November 2026

డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గొర్రెలు,మేకలు

డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గొర్రెలు,మేకలు

రాయికోడ్ జనం సాక్షి జనవరి 04 రాయికోడ్ మండలంలోని ఇటికేపల్లి గ్రామంలో బుధవారం మండల పశుసంవర్ధక శాఖ డాక్టర్. హర్షవర్ధన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గొర్రెలు,మేకలు, ఆవులు, బర్రెలు మొత్తం 458 జంతువులకు గాలి కుంట టీకలు, నట్టల మందు, గర్భకోశ చికిత్సలు పశువులకు వైద్య చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ పశు సంపద బాగుంటే పాడి పరిశ్రమ బాగుంటుందని అన్నారు. అనంతరం లంపి చర్మ వ్యాధి లక్షణాలు, చికిత్స నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విట్టమ్మ. కృష్ణారెడ్డి ఎంపిటిసి పండరి, పశుసంవర్ధక సహాయకులు కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.