Tuesday, 3 November 2026

డా: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయలు కొనసాగిస్తాం – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

జనంసాక్షి, మంథని : జన్ సంఘ్ పార్టీ వ్యవస్థపకుడు , మాజీ కేంద్ర మంత్రి డా : శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో వారి విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… అఖండ భారతవని కోసం ప్రాణాలు అర్పించిన, భారత మాత ముద్దు బిడ్డ, జన్ సంఘ్ వ్యవస్థపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలు కొనసాగిస్తాం అన్నారు. ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చెలేగా.. నహీ చెలేగా.. ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత.. దేశంలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన ఇవాళ బీజేపీ రూపంలో మహావృక్షంగా విస్తరించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.. భారత దేశంలో అనాడు రెండు రాజ్యాగంలు ఉండేవి, కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రధాన మంత్రి ఉండేవి, ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత ఆయన.. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదానం (జూన్ 23, 1953) సందర్భంగా ఆ మహానీయున్ని గుర్తు చేస్తుకుందమన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీకో కన్వినర్ నాంపల్లి రమేష్ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్,రాపర్తి సంతోష్, ఎడ్ల సదశివ్,మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్, యువ నాయకులు ఎడ్ల సాగర్, కురుమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.