Tuesday, 3 November 2026

పెట్రోలులో నీరు ఆందోళనకు దిగిన వాహనదారులు అది ఇత్తనాలంటూ బుకాయించిన యజమాని

తూప్రాన్ జులై 1( జనం సాక్షి) ::: పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకున్న కొద్దిసేపటికి బండి మురాయించడంతో తనిఖీ చేయగా పెట్రోల్ లో నీరు రావడంతో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు తూప్రాన్ శివారులో గల మాసాయిపేట స్టేషన్ వద్ద గల మెట్రో సర్వీస్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ పంపు లో ప్రతిరోజు పెట్రోల్ పోయించుకునేవారు ఈరోజు ఉదయం పెట్రోల్ పోసుకొనగా వాహనాలు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోగానే ఆగిపోవడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు మాసాయిపేట దగ్గర గల తండాకు చెందిన సురేష్ అనే వ్యక్తి ఉదయం మెట్రో పెట్రోల్ పంపులు పెట్రోల్ పోసుకున్నాడు కొద్దిసేపటికి బైకు ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు వెళ్లగా అతను వాహనాన్ని చెక్ చేసి పెట్రోలు కల్తీ ఉందని పెట్రోలు బాటిల్ లో కి తీయగా అడుగున నీరు పైన పెట్రోలు ఉండడంతో తాను పోసుకున్న పెట్రోల్ పంపు వద్దకు వచ్చి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సూపర్వైజర్ అశోక్ రెడ్డిని నిలదీశాడు అంతకు ముందు పెట్రోల్ పోసుకున్నవారు వాహనాలతో వచ్చి గొడవకు దిగి పెట్రోల్ బంక్ బందు చేయించారు రాత్రి పెట్రోల్ లారీ వచ్చిందని తమకేమీ తెలవదని తమకు సంబంధం లేదని చెప్పగా వాహనదారులు ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి ఆందోళన కారులను శాంతిప చేయించారు పెట్రోలులో నీరు వచ్చిన విషయంపై మెట్రో సర్వీస్ స్టేషన్ యజమాని కార్తీక్ రెడ్డిని వివరణ అడగగా రాత్రి ట్యాంకర్ వచ్చిందని పెట్రోలులో నీరు వచ్చిన విషయాన్ని హెచ్ పి పెట్రోల్ పంపు అధికారులకు ఫిర్యాదు చేశామని ఈతనల్ ఎక్కువ శాతం కలపడంతో ఈ విధంగా వచ్చిందని వారు సమాధానం చెప్పారని చెప్పారు దీంట్లో తమ యాజమాన్యం ఎలాంటి ప్రమేయం లేదని హెచ్పి పెట్రోల్ పంపు అధికారులు వచ్చి తనిఖీ చేసి తర్వాతనే విక్రయాలు జరుపుతామని అప్పటివరకు పెట్రోల్ పంపులు బందు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ విషయంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వాహనాలకు రిపేర్ ఖర్చులు వివరిస్తారని పెట్రోల్ పంపు పై కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ఉన్నతాధికారులను కోరారు పెట్రోల్ బంక్ లో నీరు వచ్చిన విషయం తెలుసుకున్న వారు కొందరు పెట్రోల్ పంపు వద్దకు వచ్చి తిట్ల వర్షం కురిపించారు మరి అధికారులు హెచ్పి పెట్రోల్ పంపు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు