Tuesday, 3 November 2026

డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో సిద్దార్థ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : శుక్రవారం వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో తమ కాలేజ్ కి చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని జిల్లా కేంద్రంలోని సిద్దార్థ డిగ్రీ కాలేజ్ ఛైర్మన్ మైలారిశెట్టి సైదారావు అన్నారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ 3వ సెమిస్టర్ లో బిఎస్సీ ( ఎంపిసిఎస్) గ్రూప్ స్టూడెంట్  చీదరి నిఖిత 10 కి 10 జీపీఏ సాధించినట్లు చెప్పారు. చీదరి నిఖిత వరుసగా 1వ, 2వ , 3వ సెమిస్టర్ లలో 10కి 10 జీపీఏ సాధించడం గర్వకారణం అన్నారు. 3వ సెమిస్టర్ లో బిఎస్సీ ( ఎంపిసిఎస్) గ్రూప్ స్టూడెంట్స్ కంచర్ల సౌమ్య 9.76 , అవిరెండ్ల లిఖిత 9.68 , బిఎస్సీ (బిజెడ్ సీ ) గ్రూప్ స్టూడెంట్ మొగిలిచర్ల శృతి 9.72 , బీకాం( సీఏ) స్టూడెంట్ ఉప్పతల స్నేహలత 9.20 జీపీఏ సాధించినట్లు తెలిపారు.వీరితో పాటు పలువురు విద్యార్థులు 9కి పైగా జిపిఏ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.