Sunday, 8 November 2026

డిజెబుల్ టీం ఇండియా కెప్టెన్ మహేష్ కు డాక్టరేట్ ప్రధానం

డిజెబుల్ టీం ఇండియా కెప్టెన్ మహేష్ కు డాక్టరేట్ ప్రధానం :శామీర్ పేట్, జనంసాక్షి :కడు పేదరికం నుంచి డాక్టరేటు స్థాయికి గత 10సంవత్సరాల నుండి స్పోర్ట్స్ విభాగంలో ఎన్నో విజయాలు ఒంటి చేత్తో ఎన్నో దేశాల్లో భారత దేశ ఔన్నత్యాcన్ని చాటుతూ అద్భుత విజయాలు కనపరచిన నిరుపేద గిరిజన యువకుడు డిజేబుల్ టీం ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధీరావత్ మహేష్ నాయక్ సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేశారు.
అంగవైకల్యాన్ని పేదరికాన్ని ఎదిరించి ఎన్నో విజయాలు ఎందరో ప్రశంసలు అందుకుని సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలబడుతున్న మేడ్చల్ జిల్లా లింగాపూర్ తండా కు చెందిన ధీరావత్ మహేష్ పుట్టింది కడు పేదరికంలో చదువుకున్నది ఇంటర్మీడియటే విధి వంచిత పరిస్థితుల్లో ఓ చెయ్యిని కోల్పోయిన కలత చెందకుండా తన వైకల్యాన్ని కష్టాలను ఎదిరించి అనుకున్నది సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగిన ధీరావత్ మహేష్ ఒంటి చేత్తో తండా నుంచి దేశ దేశాల్లో ప్రతిభను కనబరిచి ఇండియన్ డిజేబుల్ టీంక్రికెట్ కెప్టెన్ గా ఎన్నో విజయాలను సొంతం చేసుకొన్న ధీరావత్ మహేష్ కు సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్లు ఢిల్లీలో డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో డాక్టర్ జాన్ యూనివర్సిటీ డైరెక్టర్,ఆఫ్ పార్టీ తెలంగాణ ఇంచార్జిఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భాటియాలు పాల్గోన్నారు.
22ఎస్పీటీ -1: డాక్టరేట్ అందకుంటున్న మహేష్
.