Sunday, 8 November 2026

మండల సమైక్య సమావేశం.

మండల సమైక్య సమావేశం.
ఫొటో : పోస్టర్లను ప్రదర్శిస్తున్న అధికారులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండల మండల సమాఖ్య సమావేశం గురువారం బెల్లంపల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈసమావేశంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై కళాకారులచేసి ప్రదర్శన నిర్వహించారు. సఖి కేంద్రం ఆధ్వర్యంలో మహిళలపై గృహహింస, వరకట్నం వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం రవాణా నివారణకు అవగాహనా కల్పించారు. ఈసమావేశంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు బజార్ ఏరియా మేనేజర్ రాకేష్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఏపిఎం శ్యామల, బెల్లంపల్లి మహిళా సంఘాల మండల అధ్యక్షులు పొడిపాక స్వప్న, గ్రామైఖ్య సంఘాల ఈసీ సభ్యులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు