Sunday, 8 November 2026

మునిసిపాలిటీ నుంచి వచ్చే మురుగు నీరు పై ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

మునిసిపాలిటీ నుంచి వచ్చే మురుగు నీరు పై ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

షాదనగర్ నుండి వచ్చే మునిసిపాలిటీ మురుగు నీరు, లింగారెడ్డిగూడా గ్రామము , పోచమ్మ చెరువు,పెద్దిన్ చెరువు మరియు తుంగ కుంట మంచి నీటి చెరువుల ను కలుశితం చేస్తోంది అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న గౌరవ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారిని,మునిసిపల్ ఛైర్మన్ గారిని భీష్వ. మాధవి రామకృష్ణ సర్పంచ్, ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సభ్యులు ,గ్రామ పెద్దలు కలుసుకొని సమస్య తీవ్రతను వివరించడం జరిగింది.ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు మునిసిపల్ చైర్మన్ నరేందర్ గారిని,కౌన్సిలర్ యూగుండర్ గారిని పంపించడం జరిగింది. మురుగు నీరు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గారి సహకారంతో కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది