డిప్టేషన్ల రద్దు ఓ నాటకం
* పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి గణేష్
టేకులపల్లి, డిసెంబర్ 27( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన శాఖ అధికారులు వసతి గృహాలలో పనిచేసే హెచ్ డబ్ల్యు ఓ, ప్రధానోపాధ్యాయుల డిప్టేషన్ లు రద్దుచేసి తమ సొంత పోస్టులకు పంపిస్తున్నట్లుగా చేసిన డిప్టేషన్ రద్దు ఓ నాటకం అని పి డి యస్ యు జిల్లా కోశాధికారి జె గణేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన శాఖ జిల్లా అధికారులు సందర్భరాహిత్యంగా విద్యా సంవత్సరం ముగింపు సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల అనేక అనుమానాలకు తావిస్తుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 22వ తారీకున ఈ నిర్ణయం వెలువడింది. కానీ రాత్రికి రాత్రే మారిపోయిందనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి (పిఓ) తీసుకున్న నిర్ణయమే ఇలా తారుమారయ్యే పరిస్థితులు ఉంటే అసలు పిఓ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమా ? లేక పీవోను సైతం జిల్లా అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదని ఆయన అన్నారు. గిరిజన శాఖలో విద్యాభివృద్ధి కోసమే డిప్టేషన్ లు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ విద్యార్థుల చదువుల కోసం కాకుండా అదే శాఖలో పనిచేస్తున్న కొద్దిమంది పైరవీకారులకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఎందుకంటే అవసరాల రీత్యా డిప్యూటేషన్ అనేది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుంది కానీ సంవత్సరాల తరబడి ఒకే వసతి గృహంలో డిప్యూటేషన్ పై కొనసాగించడం అంటే అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డిప్టేషన్ పేరుతో శాఖలో పనిచేసే కొంతమంది పైరవీకారులు సూచించిన వారిని తమకి ఇష్టమైన ప్లేసులకు పంపించడం,అధికారుల కోపతాపాలకు గురై హెచ్ డబ్ల్యు ఓల స్థాన చలనం చేయడం లాంటివి మాత్రమే ఇప్పటివరకు డిప్టేషన్ ప్రక్రియ కొనసాగింది తప్ప విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం జరగలేదని,అధికా




