తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాదిగలకు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్నచూపు చూస్తున్నారని అందుకు మంత్రి వర్గం నుండి తాటికొండ రాజయ్య అకారణంగా తొలగించడంతో పాటు వివిద నామినేట్ పదవుల నియామకాలె అనేక ఉదాహరణలు అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు.
మంగళవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఎర్రోల్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తామని, తన నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ విషయంలో ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా కనీసం ఎస్సీ వర్గీకరణ పై ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న సందర్భంలో రేపు జరపబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్లీ మాదిగలకు అవకాశం ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో తెలియజేస్తున్నాం. BRS కు మాదిగలే ఒటు ద్వారా బుద్ధి చెబుతారని
BJP పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగలంతా BJP గెలుపుకు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. నాడు ఎస్సీ వర్గీకరణ చేసిన తెలుగుదేశం పార్టీకి మాదిగలు బ్రహ్మ రధం పట్టిన విషయం గుర్తు చేసుకోవాలని తెలుపుతున్నాం. వర్గీకరణ చేయకుండా మాదిగల మద్దతు BJP పొందలేదని స్పష్టం చేస్తున్నాం
దళితబందు పథకం ప్రతి దళిత కుటుంబంలో ఇవ్వాలని, పైరవీకారులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వకుండా
పేదరికం ప్రతిపాదికన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాదలకు దళితబందు లో
ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువసేన కన్వీనర్ ఎలుకటి జనార్థన్ మాదిగ, రాష్ట్ర నాయకులు: కవ్వంపల్లి రవి మాదిగ, పొలిమేర బాలస్వామి మాదిగ, జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల సురేష్ మాదిగ, జిల్లా నాయకులు తూముల రాజ్ కుమార్, మండలాధ్యక్షులు పెండ్యాల ఆనంద్ పాల్ మాదిగ, నాయకులు: చదిరం నరేష్ మాదిగ, తాల్లపల్లి కుమారస్వామి మాదిగ, సప్పి పాపన్న మాదిగ, కాంపల్లి సమ్మయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు




