స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 27 జనం సాక్షి న్యూస్ : పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నీటి సంఘం చైర్మన్, మాజీ యాదవ సంఘం అధ్యక్షులు, స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ కుటుంబ సభ్యులను టీపీసీసీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్ పరామర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గతంలో అందరం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్, క్రమశిక్షణతో నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీకి తమ విలువైన సేవలు అందించారని స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ అకాల మరణం తనకు దిగ్భ్రాంతి కలగజేసింది అని తెలిపారు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి చివరి వరకు పార్టీలోనే కొని సాగారని తెలిపారు స్వర్గీయ నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అంటే వారికీ ఎనలేని గౌరవం అభిమానం అని తెలిపారు, చంద్రబాబు నాయుడు విజన్ ను అభినందించే వారిని, భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు పడే కష్టాన్ని చాలా ఇష్టపడే వారిని తెలిపారు దేవరకొండ పట్టణం అభివృద్ధి చెందడంలో స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ ఎంతో కృషి చేశారని తెలిపారు దేవరకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీని, దేవరకొండ మాజీ సర్పంచ్ స్వర్గీయ హనుమంతు చంద్రన్న గౌడ్ తో పాటు కొమ్మినేని రాములు యాదవ్ పార్టీ పటిష్టత కోసం పని చేశారని వారి సేవలను కొనియాడారు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హరి నాయక్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఆంజనేయులు యాదవ్, నేనావత్ మోతిలాల్, దుబాయ్ మహేందర్ యాదవ్, జైపాల్ నాయక్, నాగార్జున నాయక్, జీవన్, సీతారాంతదితరులు పాల్గొన్నారు
స్వర్గీయ కొమ్మినేని రాములు యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్




