Wednesday, 4 November 2026

డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు

 

 

 

 

 

వరంగల్ ముద్దుబిడ్డ బండ ప్రకాష్ కు డిప్యూటీ చైర్మన్ కు ఎంపిక చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలుడిప్యూటి చైర్మన్ గా బండ ప్రకాష్ ఆ పదవికి మరింత వన్నె తేవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(హైదరాబాద్ , ఫిబ్రవరి 12)వరంగల్ ముద్దు బిడ్డ, మేధావి, బడుగు, బలహీన వర్గాల నాయకులు శ్రీ బండ ప్రకాష్ గారు తనకున్న రాజకీయ అనుభవం, పరిజ్ఞానంతో డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలని, తెలంగాణ శాసన మండలి ప్రతిష్టను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆకాంక్షించారు.డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బండ ప్రకాష్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.టి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా విశేషమైన సేవలు అందించి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం గొప్ప అవకాశం అన్నారు.వరంగల్ ముద్దుబిడ్డ శ్రీ బండ ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్ గా ఉన్నతమైన సేవలు అందించి ఆ పదవికి, తెలంగాణ శాసన మండలికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారిని అభినందించిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి, అరురీ రమేష్, యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మండలి మాజీ చీఫ్ విప్ బొడేకుంటి వెంకటేశ్వర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు సమ్మారావు, వరంగల్ నాయకులు, తదితరులు ఉన్నారు.