సూర్యాపేట ప్రతినిధి, ఫిబ్రవరి 12 ( జనంసాక్షి ): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దాతల సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారు నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం ఆదివారం నాటికి 200వ రోజుకి చేరింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే విధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు,వారి సహాయకులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహార పంపిణీ అభినందనీయం అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు జనరల్ ఆసుపత్రి నందు గల వసతులు,సౌకర్యాల వల్ల ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడ వైద్యం కోసం వస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.అనంతరం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు అల్పాహారం పంపిణీకి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి ఎండీ మీలా మహదేవ్ , సుధాబ్యాంక్ ఎండీ పెద్దిరెడ్డి గణేష్ , పటేల్ నర్సింహ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ చంద్ర, సెక్రటరీ యాదా కిరణ్, ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మిట్టకోల యుగంధర్, దూలం నగేష్ తదితరులు పాల్గొన్నారు.




