యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 8 (జనంసాక్షి). పాత్రికేయులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ ప్రతినిధులకు పుష్ప గుచ్చన్ని అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో పాటు ప్రతినిధులు మాట్లాడుతూ పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన యశోద హాస్పిటల్ నిర్వాహకులను అభినందించారు. పాత్రికేయులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాత్రికేయులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, ఐజేయు జిల్లా కార్యదర్శి కాంభోజ ముత్యం, యశోద హాస్పిటల్స్ సురేష్ , వైద్యులు పాత్రికేయులు పాల్గొన్నారు.




