Wednesday, 4 November 2026

డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా కుట్టు మిషన్ల పంపిణీ – నిరుపేద మహిళలకు బాసటగా నిలుస్తున్న బొడిగె సవిత గౌడ్

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 24 :-. నిరుపేద మహిళల అభ్యున్నతి కోసం ఎస్ డి ఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ లను అందజేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు సోమవారం ఎస్ డి ఎఫ్ జనరల్ సెక్రెటరీ బొడిగె సవిత గౌడ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా హాజరై మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అత్యధికంగా నిరక్షరాస్యులైన నిరుపేదలే ఉన్నారని భార్యాభర్తలు ఇరువురు కలిసి పని చేస్తేనే బతుకు బండి నడవలేని ఈ తరుణంలో నిరుపేద మహిళలకు ఉపాధిని కలిగించాలనే సఉద్దేశంతో ఎస్ డి ఎఫ్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందజేసి వారి కుటుంబాలకు బాసటగా నిలవడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎస్ డి ఎఫ్ వారికి ఎల్లవేళలా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా సతీమణి రెడ్డి శెట్టి నాగరాణి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రెడ్డిశెట్టి మహేష్ గుప్తా శ్రీమన్నారాయణ ఎస్ డి ఎఫ్ ట్రెజరర్ రమేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎలీషా మంజుల సంపూర్ణ మౌనిక వనిత నయుం మహిళలు తదితరులు పాల్గొన్నారు