Wednesday, 4 November 2026

బిఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలి

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 24
మల్కాజిగిరి నియోజకవర్గంలోని లక్ష్మి సాయి గార్డెన్ లో నేడు మంగళవారం 10 గంటలకు జరిగే బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గం ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంబి పూర్ రాజు హాజరవుతారని పార్టీ నాయకులు,కార్యకర్తలు,కార్పొరేటర్లు, మాజీ కార్పోరేటర్లు,ఉద్యమ నాయకులు,సీనియర్ నాయకులు, మహిళా సోదరమణులు వివిధ డివిజన్లకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు పార్టీ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి డివిజన్ లో కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు పార్టీ నాయకులతో కలిసి ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు వారు వారి డివిజన్లలో పార్టీ జెండాలు ఎగురవేసి సభ ప్రాంగణానికి రావాలని అన్నారు.