హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 140 మిలియన్ యూనిట్లు కాగా డిమాండ్ మేరకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఆరుగంటల సరఫరా కొనసాగుతోందన్నారు. అవసరం మేరకు రోజూ 3 నుంచి 5 మిలియన్ యూనిట్లు కొంటున్నామని రఘుమారెడ్డి తెలిపారు.




