రఘునాథ పాలెం మే 23(జనం సాక్షి)
గౌతమ బుద్ధుని ఆలోచనలతో, జ్యోతిభా పూలె, డా బి ఆర్ అంబేద్కర్ – భాగ్యరెడ్డి వర్మ ఆశయ సాధనలో భాగంగా. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా వైరా మండలానికి చెందిన మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులైన పానెం. సోనీ, చంద్రశేఖర్ కు మరియు “శైలింగ్” లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 15 గోల్డ్ మెడల్స్ సాధించిన పిల్లి “అఖిల్” కు “పే బ్యాక్ టు సొసైటీ” ఆధ్వర్యంలో సంస్థ సభ్యులైన కాల్వ దేవదాస్ (కే ఎస్ ఎల్ టెక్నా్క్రాట్స్-పాల్వంచ), ఖమ్మం “శాన్వి” హాస్పిటల్ డా. శివకృష్ణ-డా శశాంక దంపతులు మరియు ఖమ్మం “సుజాత” హాస్పిటల్ ఎమ్ డి రెంటాల భరత్, ఎమ్ జయరాజ్, జమ్మి జైపాల్, జె సంజీవరావు మరియు సొసైటీ సహాయంతో. పేదరికంలో ఉండి కూడా ఎంతో కస్టపడి పిల్లల్ని చదివిస్తున్న విద్యార్థుల తండ్రికి, మెమోంటోని అందించి కుమార్తె మెడిసిన్ విద్యార్థిని పి సోని ని సన్మానించి పదివేల రూపాయలు అందించడం జరిగినది. శైలింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రానిస్తున్న అఖిల్ కి వెన్నoటి ఉంటూ నిత్యం సహకారం అందిస్తున్న వారి బాబాయ్ పిల్లి రాజు పోలీస్ కానిస్టేబుల్ ఏ సి బి కి పదిహేను వేల రూపాయలను సహాయంగా అందించి వారిని ఘనంగా సన్మానించడం జరిగినది. కార్యక్రమానుద్దేశించి శాన్వి హాస్పిటల్ దంపతులు మాట్లాడుతూ. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు మరియు మనమొచ్చిన సమాజానికి ఎంతో కొంత సేవచేయడం అదృష్టంగా భావిస్తున్నాము అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నతి విద్యకు చేతనైనంత వరకు ఎంతో కొంత సహాయం చేస్తూ వారికీ ఆసరా గా నిలవడమే “పే బ్యాక్ టు సొసైటీ” లక్ష్యం అని, దీనిలో ఉద్యోగ మేధావులైన ప్రొఫెషనల్స్ సభ్యులుగా చేరి సొసైటీ ని ఇంకా ముందుకు తీసుకోపోడానికి ఎక్కువ మంది పేద విద్యార్థులకు సహాయం చేసేలా సహకరించాలని వ్యస్థాపకులు జంగం లక్ష్మణ్ రావు, చిలకబత్తిన కనకయ్య తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గులగట్టు.యల్లయ్య, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ పప్పుల.వేణుగోపాల్,పిల్లి. అభిలాష్, సవ్వడి సెల్ ఫోన్స్ అధినేత పి.శ్రీనివాస్-వాసు, జి. సాయిబాబు, బి.మోహన్ రావు,గుడిపుడి.కృష్ణ మరియు శాన్వి హాస్పిటల్ సిబ్బంది అంజయ్య,వెంకటనారాయణ,కిరణ్,సౌజన్య,లావణ్య,అఖిల్,నిర్మల,పవన్,శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత




