మోత్కూర్ నవంబర్ 7 జనంసాక్షి : ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోత్కూరు మండలంలో 200 మందికి పోస్టల్ ప్రమాద బీమా పాలసీని ఈనెల 17న స్థానిక ఆర్యవైశ్య భవన్ లోనిర్వహించనుండగా,ఆ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని యాదాద్రి భువనగిరి డిసిపి కె నారాయణ రెడ్డి ని సోమవారం ఆరాధ్య ఫాండేషన్ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. నిరుపేదల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డిసిపి అన్నారు. ఆహ్వానించిన వారిలో ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పత్తేపురం విజయ్ కుమార్, కల్వల నరేష్,మోత్కూర్ మండల ప్రతినిధులు కాపర్తి సైమన్, గనగాని నర్సింహా ,ఎలిమినేటి జహంగీర్,ధబ్బేటి సోంబాబు తదితరులు ఉన్నారు.
డిసిపి ని ఆహ్వానించిన ఆరాధ్య ఫౌండేషన్




