Wednesday, 4 November 2026

నేడు పిఏపల్లిలో పర్యటించనున్న ఎంఎల్ఏ రవీంద్రకుమార్

పెద్దఅడిషర్లపల్లి నవంబర్ 7(జనంసాక్షి):మండలంలోని పలు గ్రామాలలో ఎంఎల్ఏ రవీంద్రకుమార్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు మన ఊరు,మనప్రభుత్వం, మన పధకాలు కార్యక్రమాలలో భాగంగా గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన ఘనపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి, అక్కంపల్లి,పోల్కంపల్లి,భీమనపల్లి,కేశంనేనిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పధకాల శంకుస్థాపన చేయనున్నారు.గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులగురించి ప్రజలకు వివరించి, సమస్యలను తెలుసుకొని పరిష్కరించనున్నారు.