పెనుబల్లి, జూన్ 3(జనం సాక్షి)బెంగుళూరు డీ ఆర్ డీ ఓ లో పెనుబల్లి మండలం రామచందర్రావు బంజరు గ్రామానికి చెందిన చెన్ను నరేష్ శనివారం ఎంపిక అయ్యాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం ఐన రామయ్య లక్ష్మి ల కుమారుడు నరేష్ బీ టెక్ పూర్తి చేసి 2013 లో డీ ఆర్ డీ ఓ లో టెక్నీకల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ సైంటిస్ట్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు, ఈ ఏడాది జరిగిన గేట్ పరీక్షలో అర్హత సాధించి సైంటిస్ట్ ఇంటర్వ్యూ కు 3 దశలలో విజయం సాధించి శనివారం బెంగుళూరు డీ ఆర్ డీ ఓ లో సైంటిస్ట్ గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్బంగా గ్రామస్థులు నరేష్ ను అభినందించారు .
డీఆర్ డీఓ లో సైంటిస్ట్ గా మండల యువకుడు ఎంపిక.




