హైదరాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోదండరాం, ఐకాస నేతలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేందుకు డీఎస్‌ను కలిసినట్లు కోదండరాం చెప్పారు. రాజకీయ పార్టీలతో ఢిల్లీలో ఐకాస త్వరలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ అంశంపై డీఎస్‌తో చర్చించినట్లు ఐకాస నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.




