Wednesday, 4 November 2026

బిజెపి ప్రముఖులతో ఇల్లందు సమస్యలు చర్చించిన హాథిరాం నాయక్

బిజెపి ప్రముఖులతో ఇల్లందు సమస్యలు చర్చించిన హాథిరాం నాయక్

టేకులపల్లి, డిసెంబర్ 10 ( జనం సాక్షి): గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్ &టీమ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరుసత్యనారాయణ గారి తనయుడు కోనేరు సాయి ప్రకీర్త్ నిచ్చితర్థ వేడుకకు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వాడించారు. ఈ కార్యక్రమం నకు ప్రముఖ బీజేపీ జాతీయ &రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. బిజెపి నాయకురాలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు లతో ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయ ఆర్థిక వనరుల గురించి వివరిస్తూ ఇల్లందులో నెలకొన్న పలు సమస్యల గురించి హతీరామ్ నాయక్ వివరించారు. ఈ నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఆంధ్ర జ్యోతి ఏడిటర్ రాధాకృష్ణ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్, రంగకిరణ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఇల్లందు నాయకులు గోపిక్రిష్ణ, టేకులపల్లి మండల బిజెపి అధ్యక్షులు ధారావత్ బాలాజీ నాయక్, జె రాంచందర్ నాయక్, బి సురేష్ బాల తదితరులు పాలుగోన్నారు.