– కాంగ్రెస్‌లోకి వస్తామంటే మేం ఒప్పుకుంటామా
– ఒక్కసారి కమిటీ నేతలు ఆలోచన చేయాలి
– బీసీల వ్యతిరేకి కేసీఆర్
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌నేత విహెచ్ హన్మంతరావు
హైదరాబాద్, జులై10(జనం సాక్షి ) : డీఎస్‌ను కేసీఆర్ మళ్లీ పిలిచి శ్రీనన్న అంటే ఆయన వెంటనే కేసీఆర్ భజన చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ హన్మంతరావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్యాయం చేసి టీఆర్‌ఎస్‌లో డీఎస్ చేరారన్న వీహెచ్ మండిపడ్డారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో పక్కన పెట్టారని కాంగ్రెస్‌లోకి వస్తాను అంటే మేం ఒప్పుకుంటామా? అని ఎదురు ప్రశ్నించారు. డీఎస్‌ను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అని ఒక్కసారి కమిటీ నేతలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. మరోవైపు బీసీలంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రేమ లేదని వీహెచ్ ఆరోపించారు. 2014లో సమగ్ర సర్వే చేసి 54 శాతం బీసీలు ఉన్నారని చెప్పారని అన్నారు. బీసీలపై ప్రేమ లేదు కానీ, బీసీ ఓట్లు ఆయనకు కావాలని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారని దుష్పచ్రారం చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్, మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్తున్నామంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకుంటుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెరాస పాలనపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతుందని అన్నారు. అందుకు ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రశేఖర్‌రావు హడావుడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఖాయమని, గెలుపును అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదన్నారు.
డీఎస్ మళ్లీ కేసీఆర్ భజన చేస్తాడు…!




