డోర్నకల్ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన డి ఎస్ రెడ్యానాయక్…
డోర్నకల్ ప్రతినిధి, డిసెంబర్31(జనంసాక్షి):
డోర్నకల్ ప్రజలకు డి ఎస్ రెడ్యా నాయక్ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
2023 సంవత్సరంలో డోర్నకల్ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోశాలతో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.మంచి పంటలు పండి, పారిశ్రామిక పరంగా విద్యా పరంగా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్లు డి ఎస్ రెడ్డి నాయక్ నేడోక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చాలా నోటిఫికేషన్లు జారీ చేసినందున నిరుద్యోగ యువత కష్టపడి చదివి అత్యధిక ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తామని తెలియజేసారు.రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా మాస్క్ ధరించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.




