డోర్నకల్ జూన్ /3/జనం సాక్షి న్యూస్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రెండవ రోజు రైతు దినోత్సవం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గొల్లచర్ల గ్రామ రైతు వేదికలో స్థానిక సర్పంచ్ చె రెడ్డి సమ్మిరెడ్డి అధ్యక్షతన బతుకమ్మ బోనాలు, డిజె సప్పట్లతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నున్న రమణ, ఉపాధ్యక్షులు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్, మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, ఎంపీఓ మున్వర్ బేగ్, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ
వ్యవసాయ రంగానికి నేడు తెలంగాణ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నదని, తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం ఇస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం,ప్రతి ఎకరాకు సాగు నీరు, బీడు భూములు మొత్తం మాగాణి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటు, వారి అభివృద్ధికి చేయూత అందిస్తుందని మంత్రి అన్నారు.ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ, నిస్ప్రహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలికృతమైంది.
నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల
అవుతుంది, రాష్ట్రంలోని కర్షక సోదరులు అంతా కేసీఆర్ ను రైతు బాంధవుడిగా కొలుస్తున్నారని, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు మాత్రమే ఖర్చు ఖర్చు చేసేవారని, కాని రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 20 రేట్లు నిధులు అధికంగా ఖర్చు చేస్తుందని, అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల తరపున 12 వందల కోట్లు విధ్యుత్ సంస్థలకు చెల్లించి ఉచిత కరెంట్ అందిస్తున్నారు.ప్రపంచంలోనే రైతు బంధు పథకం అమలు చేస్తూ, రైతు భీమాను చెలిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, పట్టా భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు అమలు అవుతుందని మంత్రి గుర్తు చేశారు, గతంలోనూ ప్రభుత్వాలు పాలించినప్పటికి రైతు కుటుంబాలు ఏనాడు సంతోషంగా లేవని,కొందరు రాజకీయంగా ఎదుర్కోనలేక దురుద్దేశ్యంతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని, నిజాలను కూడా నిజం అని ఒప్పుకోవడం వారి కష్టం గా వుందన్నారు తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు అందుతున్నది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కనిపించడం లేదా, రాష్ట్రం లో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా తెలంగాణలో వ్యవసాయం రూపు రేఖలు పూర్తిగా మారాయని, ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే
మూడు రేట్లు వరి విస్తీర్ణం పెరిగింది,
అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉండే వారు, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించడం జరిగింది.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్ కోటి, సర్పంచులు బాదావత్ బాలాజీ, బానోతు రాంబాయి మంగీలాల్, అజ్మీర లెనిన్ కుమార్, గుగులోతు దేవి శంకర్ నాయక్, బానోత్ పాండు నాయక్, ఎంపీటీసీ మల్లికార్జున్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగభూషణం, మాజీ సర్పంచ్ గంధం సిరి ఉపేందర్, ఏఈఓ రవికుమార్, ఏఎన్ఎమ్ లు, ఆశ వర్కర్లు, రైతులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




