Wednesday, 4 November 2026

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు సంక్షేమమే ప్రభుత్వ దేహం – పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. ఆదర్శ రైతులకు సన్మానం

కురవి జూన్ /3/ జనం సాక్షి న్యూస్ :కురవి మండలం నేరడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ, భారాస జిల్లా అధ్యక్షురాలు మాళోత్ కవిత మాట్లాడుతూ కాళేశ్వర జలాలతో కర్షకుల కన్నీరు తుడిచి బీడు భూములను సైతం సాగుభూమి చేసిన అపర భగీరథుడు కెసిఆర్ గారన్నారు.. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. ఎరువులకై అరువులు చేయకుండా రైతు గోస తీర్చి అన్నదాతకు అండగా నిలబడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు..
రైతు సంక్షేమ నిధి గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రైతు బంధు తో పెట్ట బడి సాయం అందించి సాగును బాగు చేసిన ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు…నాడు రేయింబవళ్ళు కరెంట్ కోతలతో కాలుతున్న మోటార్లతో ఇక్కట్లకు గురయిన కాలం నాటి నుండి నేడు 24గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.దురదృష్టవశాత్తు రైతు కాలం చేసి మరణిస్తే ఆ రైతు కుటుంబం బజారున పడకుండా రైతు భీమాతో ఆపన్నహస్తం అందించి అక్షయ పాత్ర లా .. వలసల వెతలు తీరి గరిసెలు నిండాయన్నారు.. పండించిన ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినేరుగా నగదును రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యంపిపి గుగులోత్ పద్మావతిరవినాయక్, సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, బి ఆర్ ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్ ,క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు రాంరెడ్డి,మంగిలాల్,అమిరి బాయి,కౌసల్య కిషన్, తట్టుపల్లి ఎంపీటీసీ పోతుగంటి వెంకన్న, డీఏవో చత్రు నాయక్, మండల వ్యవసాయఅధికారి మంజుఖాన్,కురవి మాజీ ఆలయ చైర్మన్ రామునాయక్, గ్రామ రైతు కోఆర్డినేటర్ లు చింగ్య నాయక్,మల్చుర్ నాయక్, జానీ,స్పెషల్ ఆఫీసర్ ఏఇ శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లెపాక మధు, ఉప సర్పంచ్ హేమంత్,నాయకులు కృష్ణ రెడ్డి,రవీందర్,నీలం నాగరాజు,కుదురుపాక వెంకన్న,విష్ణు వర్ధన్,కాంతయ్య,నబీ,సందీప్, యాకయ్య,నరేష్,రమణ,ప్రసాద్,నాగరాజు,మధు, కృష్ణ, వెంకట్,జలందర్,శేఖర్,మల్చుర్,వెంకటేష్,లకుపతి,శ్రీధర్,భద్రు,రమేష్,భిక్షపతి,బాలునాయక్, ఏఈఓ రాజేశ్వరి, కార్యదర్శులు,సొసైటీ డైరెక్టర్ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు..