కురవి జూన్ /3/జనం సాక్షి న్యూస్:కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బజ్జూరి జ్యోత్స్న వెంకట్ రెడ్డి అధ్యక్షతన రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి మాట్లాడుతూ నాటి సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ధ్వంసమైన వ్యవసాయానికి స్వరాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పెద్దపీట వేశారన్నారు.. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంగళి నర్సయ్య యాదవ్, కొత్తూరు సి సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి,సీనియర్ నాయకులు బజ్జూరి వెంకట్ రెడ్డి,ఎంపిఓ రఘుపతి రెడ్డి,ఏఇఓ కళ్యాణ్, పార్టీ అధ్యక్షులు వీరమల్లు ,రైతు సమితి కో ఆర్టినేటర్ శ్రీశైలం, రైతు బంధు సమితి మండల సమితి సభ్యులు దుబాకుల వెంకన్న,మామిళ్ళ వెంకన్న మండల ప్రచార కార్యదర్శి నరహరి , చింతపల్లి గ్రామ అద్యక్షుడు బాలాజీ, సోసైటి డైరెక్టర్ సైదులు, కొత్తూరు సి గ్రామ పంచాయతీ రైతులు కొత్త వీరారెడ్డి, యానాల వెంకట్ రెడ్డి,చింతపల్లి గ్రామ రైతులు మరియు అయ్యగారిపల్లి రైతులు పాల్గొన్నారు.




