డోలా ,నహానేక తకత్ వితరణ
తిరుమలగిరి (సాగర్), అక్టోబరు 27 (జనంసాక్షి):
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో హోం మినిస్టర్ మహమూద్ అలీ తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ని మసీద్ కు ,డోలా నహానేక తకత్, ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు గురువారం ఇనయియ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ,డోలా నహానెక తకత్, ను రాష్ట్రహోం శాఖామంత్రి మహమూద్ అలీ అందించారు. ఈసందర్భంగా మండల మైనారిటీ కోఆప్షన్ సభ్యుడు షేక్ రహీం మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో ముస్లిం ల అభ్యర్దన మేరకు తిరుమలగిరి మసీదు కు ,డోలా నహనేక తకత్, ఇప్పించినందుకు మండల కేంద్రం ముస్లిం ల తరపున హోం మినిస్టర్ కు ,ట్రస్టు చైర్మన్ మాజీ సాహెబ్ కి , ట్రస్టు సభ్యుడి హఫి అన్వర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎండి సుబాన్ ,ఎస్ కె బాషా, ఎస్ కె ఇబ్రహీం , ఎస్ కె రసూల్ ఎస్ కె ముస్తఫా ,ఎస్కె ఇబ్రహీం తదిత రులు పాల్గొన్నారు
డోలా ,నహానేక తకత్ వితరణ




