డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులకు అనూహ్య ఘటన


అల్కా విూటర్‌తో పరారైన వ్యక్తి
న్యూఢిల్లీ,నవంబర్‌28(జనంసాక్షి):  ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు చేస్తుండగా ఓ మందు బాబు కారులో వచ్చి సాక్షాత్తూ పోలీసుల నుంచి అల్కావిూటరును స్నాచింగ్‌ చేసి పరారయ్యాడు. ఈ  ఘటన న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో వెలుగుచూసింది. పీకల దాకా మద్యం తాగి మారుతీ స్విప్ట్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తిని కన్నాట్‌ ప్లేస్‌ వద్ద రాత్రి 11.40 గంటలకు ట్రాఫిక్‌ పోలీసు ఆపి డ్రంకెన్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేసేందుకు ఆల్కావిూటరు పెట్టారు. అంతే పోలీసునుంచి ఆల్కావిూటరును లాక్కోన్న మందుబాబు వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు. ఆల్కావిూటరును ఎత్తుకెళ్లింది నోయిడాకు చెందిన రిషీ థింగ్రా అని ట్రాఫిక్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. రిషీ థింగ్రా ఆఫీసు పనివిూద లండన్‌ వెళ్లాడని తేలింది. మద్యం తాగి కారు నడపడంతోపాటు పోలీసువిధినిర్వహణలో ఉండగా అల్కావిూటరు ఎత్తుకెళ్లి విధులకు అంతరాయం కల్పించాడని రిషీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.