Tuesday, 3 November 2026

బిజెపిలో చేరిన పవన్‌ అభిమానుల


హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి):   ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, అసోసియేషన్‌ వాసులు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ అధ్యక్షుడు, ముషీరాబాద్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పవన్‌కల్యాన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కవాడిగూడ అధ్యక్షుడు ఎం.నాగేష్‌ నాయకత్వంలో వంద మంది ఫ్యాన్స్‌ బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన రాంనగర్‌ డివిజన్‌ బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ సభలో పార్టీలో చేరారు. వారికి లక్ష్మణ్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు సి.కె.శంకర్‌, భరత్‌గౌడ్‌, భాస్కర్‌గౌడ్‌, అరుణ్‌, జైపాల్‌రెడ్డి, పార్థసారధి, ఉదయ్‌భగవత్‌, శ్రీనివాస్‌, రమేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.