Thursday, 5 November 2026

ప్రోటోకాల్ పాటించని అధికారులు

బిచ్కుంద జూన్ 09 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లాలోని కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. కొందరు అధికారులు తమకు సహకారం అందిస్తున్న నాయకులకు జీ హుజూర్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో జిల్లా పరిషత్ చైర్మన్ ఫోటో మరియు జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ ఫోటో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఫోటో లేదని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.