ఢల్లీి కోటలు బద్దలు కొడతాం

\

కేంద్రంతో యుద్దం చేయడానికి సిద్దమే
మా జోలికి వస్తే ఊరుకునేది లేదు
ఇది పోరాటాల గడ్డ..నేను పులిబిడ్డను
జాతీయ రాజకీయాల్లోకి వస్తే నీ అడ్రస్‌ లేకుండా చేస్తా
విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదు
బాయిలకాడ విూటర్లు పెట్టేదీ లేదు
8 ఏండ్లుగా సతాయిస్తు ప్రధాని మోడీ
తెలంగాణకు ఒక్క మంచి పని కూడా చేయలేదు
మార్చి నుంచి దళితబందు అమలు చేస్తాం
జనగామకు మెడికల్‌ కాలేజీ..ఘనపూర్‌,పాలకుర్తిలకు డిగ్రీ కాలేజీలు
జనగామ సభలో జాతీయ రాజకీయాలు..మోడీ తీరుపై విరుచుకుపడ్డ కెసిఆర్‌
జనగామ,ఫిబ్రవరి11(జనంసాక్షి): జాతీయరాజకీయాలపై సిఎం కెసిఆర్‌ స్పష్టత ఇచ్చారు. ఇక కేంద్రంతో అవిూతువిూకి సిద్దం అని ప్రకటించారు. ఢల్లీికోటలు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేవిూ కాదన్నారు. రాష్టాల్రతో ఆడుకుంటూ..నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా లాంటి వారిని లండన్‌కు సేఫ్‌గా చేర్చిన ఘనుడు మోడీ అంటూ విమర్శలు గుప్పించారు. మోడీని పారదోలితే తప్ప దేశం బాగుపడదన్ననారు. పేదలకు మోడీ చేసిందేవిూ లేదని ఘాటుగానే విమర్శలు గుప్పించారు. బిజెపిని ఉఫ్‌ అంటూ ఊదేస్తామన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ యుద్దం ప్రకటించారు. ఢల్లీి కోటలు బద్దలు కొడతామని హెచ్చరించారు. నీ ఉడుత బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తామే కేంద్రంలోకి వస్తామని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢల్లీి కోటలు బద్దలు కొడుతాం.. నరేంద్ర మోదీ జాగ్రత్త అని కేసీఆర్‌ హెచ్చరించారు. మాది త్యాగాలుచేసి.. నిలబడ్డ గడ్డ అని హెచ్చరించారు. జనగామ యశ్వంత్‌పూర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తామని.. దేశం గురించి కూడా కొట్లాడాల్సిన అసవరం వస్తే వెనక్కి పోయేది లేదన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన అసవరం ఏర్పడిరదన్న కెసిఆర్‌.. తెలంగాణ ప్రజలు కోరితే ఢల్లీి కోటలు బద్దలు కొడతామని..ఢల్లీికి పొమ్మంటారా అంటూ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ పోరాటాలు చేసిన పార్టీ…ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్లీ అన్నారు. సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించాం. విూరు కూడా దీవెనలు ఇస్తే ఢల్లీి కోటలను బద్ధలు కొడుతాం. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. విూ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. జనగామ టౌన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్లను మేం టచ్‌ చేయం.. మమ్మల్ని ముట్టుకుంటే నాశనం చేస్తాం. మేం ఊదితే విూరు అడ్రస్‌ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. విూ జాగ్రత్తలా విూరు ఉండండి. మా జాగ్రత్తలా మేం ఉంటాం అని కేసీఆర్‌ సూచించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వరు. మెడికల్‌ కాలేజీ ఇవ్వరు. నువ్వు ఇవ్వకున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను తరిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం. ప్రజల శక్తితోనే తెలంగాణను సాధించుకున్నాం. అద్భుతమైన పంటలను
పండిరచుకున్నాం. దేశంలో అన్ని రాష్టాల్రు కంటే ముందు వరుసలో ఉన్నాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం చేసిందేవిూ లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నామని ఆయన అన్నారు. 8 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ఎదిగామన్న సీఎం కేసీఆర్‌.. దేశంలో అనేక రాష్టాల్ర కంటే తెలంగాణ ముందుందని చెప్పారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, రైల్వే జోన్‌, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదాను ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రం సమస్యలు సృష్టించేందుకు చూస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మోటర్ల కాడ విూటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణం పోయినా విూట్లరు పెట్టేది లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పోరాటం చేసిన పార్టీ అని.. యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని పేర్కొన్న ఆయన.. కేంద్రానికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢల్లీి కోటను బద్దలు కొట్టేందుకు కూడా సిద్దమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే జనగామ జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని హావిూ ఇవ్వడమే కాకుండా.. స్టేషన్‌ ఘనపురం, పాలకుర్తిలలో డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేంద్రం సమస్యలు సృష్టించేందుకు చూస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు సిద్ధమని, విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారని బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ అన్నారు.
విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. పోలాల దగ్గర విూటర్లు పెట్టాలంటున్నారని, ప్రాణం పోయిన కరెంట్‌ విూటర్లు పెట్టనివ్వమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మోదీ రైతుల వెంట, పేదల వెంటపడ్డారని, చంద్రబాబు కూడా విూటర్లు పెట్టాలని చూశాడని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్టాన్రికి ఉండాలని కేంద్రాన్ని పలుమార్లు కోరాను. 30 `40 ఏండ్లు కరెంట్‌ లేక బాధపడ్డాం. 30 లక్షల బోర్లు వేశాం. దాన్ని అధిగమించాలని చెప్పి చెరువులను బాగు చేసుకున్నాం. చెక్‌ డ్యామ్‌లను నిర్మించుకుంటున్నాం. భూగర్భజలాలు పెరిగాయి. పెట్టుబడి సాయం చేస్తున్నాం. వలసలు పోయినొల్లు మళ్లీ తిరిగి వస్తున్నారు. నరేంద్ర మోదీతో రెండేండ్ల నుంచి పంచాయితీ నడుస్తోంది. కరెంట్‌ సంస్కరణ పేరిట మోదీ మోసం చేస్తున్నారు. ప్రతి మోటార్‌కు విూటర్‌ పెట్టాలని అంటే.. నన్ను చంపినా పెట్టనని చెప్పాను. ఎందుకంటే రైతు పంట పండిస్తే రైతే బతకడు కదా? ఇప్పుడు డిజీల్‌ రేట్లు పెరిగాయి. దాంతో రైతులకు ట్రాక్టర్లతో దున్నడం భారమైంది. ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండు మోదీ. విూరు పండిరచే ధాన్యం కొనం. కరెంట్‌ విూటర్‌ పెట్టాలి. లేదంటే దాడులు చేస్తాం అని కేంద్రం అంటోంది. ఇదేనా దందా.. దీని కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నాం. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటున్నాం.. అండగా నిలుస్తున్నాం. గ్రావిూణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు, పేదల వెంబడి పడ్డాడు. లక్షల కోట్లు కుంభకోణాలు చేసి, బ్యాంకులను మోసగించిన వారికి టికెట్లు కొని లండన్‌కు పంపిస్తారు. వాల్లు అక్కడ పిక్‌నిక్‌ చేస్తున్నారు. మోదీ మా ప్రాణం పోయినా సరే కరెంట్‌ బావులకు మోటార్లు పెట్టం. నువ్వు ఏం చేసినా మంచిదే. తిరగబడుతాం. కొట్లాడుతాం. అవసరమైతే ఢల్లీి దాకా వస్తాం. ఏం చేస్తావో చేసుకో. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం. దీన్ని విూద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దళితబంధు కింద ఈ సంవత్సరం 40 వేల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయనున్నామని.. సంవత్సరానికి రెండు మూడు లక్షల కుటుంబాలకు రైతు బంధును అందజేస్తామని
వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకువస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.ఉద్యమం జరిగేటప్పుడే తాను తెలంగాణ వస్తే బాగుపడతామని.. ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పా అని గుర్తు చేశారు.