సింగిల్ డిజిట్‌కు పరిమితమైన బీజేపీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : ఢిల్లీలో సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోదీ సుడిగాలికి కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో సీట్ల సునామీని సృష్టించారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 67 సీట్లతో ప్రత్యర్థులకు కల్లు తిరిగిపోయేట్టు చేశారు. బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. వికాస్‌నగర్, రోహిణి, మస్తాఫాబాద్‌లో పొందిన బీజేపీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. 15 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరువలేదు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు కిరణ్‌బేదీ, అజయ్ మాకెన్‌లు ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో ఆప్ 53 శాతం ఓట్లను సాధించింది. ఢిల్లీలో విజయంతో ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కేజ్రీవాల్ అంటూ కార్యకర్తలు పాటలు పాడుతూ చిందులేస్తున్నారు.




