తండ్రి చంపాలని వస్తే ఆవు కాపాడింది!

cow

కన్నకూతురును హత్యచేసేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రికి గట్టిగా బుద్దిచెప్పింది ఆవు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో మరో వ్యక్తితో కలిసి కూతురుని హత్యచేసేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి. దాన్ని గమనించిన ఆవు.. ఆ దుండగులపై ఒక్కసారిగా విరుచుకుపడింది. కొమ్ములతో కుమ్మేస్తూ వారిని చిత్తుచేసింది. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ దుండగులు.. ప్రాణభయంతో పరుగులు తీశారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ విజువల్స్‌.. సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. బాలికను రక్షించిన ఆవుపై ప్రశంసలు కురుపిస్తున్నారు నెటిజన్లు.