హైదరాబాద్,మే30(జనం సాక్షి): ఓ వైపు రుతపవనాలు ఆగమం మొదలయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. వానజాడకు మరో వారం రోజలు సమయం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో తెల్లారింది మొదలు భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు మంగళవారం మరోసారి నమోదైంది. వేడి గాలులు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలే కాదు రాత్రివేళల్లోనూ ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.బుధవారం 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. మూసాపేట మరికొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడింది.
తగ్గని ఎండల తీవ్రత..అల్లాడుతున్న జనం




