జనంసాక్షి, మంథని : మంథని మున్సిపల్ పరిధిలో శ్రీపాద కాలనీ, పోచమ్మ వాడ, గంగపురి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, అయ్యగారు చెరువు దగ్గరలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేగ్గం రాజేష్,పెద్దపల్లి కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముసుక్కుల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అనంతరం అకాల వర్షాలకు రైతుల కష్టం నీటిపాలు అయిపోయింది వారికి నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో గ్రామాలలో భారీ వర్షం మూలంగా ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యం కొట్టుకు పోయిందన్నారు. ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యంకు ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అధికారులు ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఎగుమతి దిగుమతి చేసే దగ్గర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దాని మూలంగా అకాల వర్షాలు వచ్చినప్పుడు ఐకెపి కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం ప్రకృతి వైపరీత్యాలకు గురికావాల్సి వస్తుందన్నారు. అన్ని ఐకెపి కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు.కాంటాలు వేసిన వెంటనే రైతుల అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.అధికారులు తక్షణమే ఐకెపి కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి కంటి సతీష్,అజీమ్ ఖాన్,మంథని సత్యం, ఎరుకల ప్రవీణ్,మంథని రాకేష్,ఆయిలి ప్రసాద్,గుండా రాజు, పెంటరి రాజు, ఆకుల శ్రీనివాస్,బండారి ప్రసాద్,తోకలా మల్లేష్,పెరుగు తేజ,పొరండ్ల రంజిత్,పంచిక్ మోహన్, ఊర గొండ గణేష్,ఎరుకల రమేష్ బాబు, సల్మన్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.




